Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డీజిల్​ తో ఆలూ పరాటా.. వైరల్​ వీడియో ఇదిగో

Trending diesel paratha viral video
Advertisement
  • ఇదో వెరైటీ పరాటా అంటూ తయారు చేస్తున్న ఓ హోటల్ నిర్వాహకుడు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్ల కామెంట్లు
Advertisement
టేస్టీ టేస్టీ పరాటాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు? నూనెతోనే కాకుండా బట్టర్ లేదా నెయ్యి వేసి కాల్చి చేసిన పరాటాలను చాలా మంది ఆబగా లాగించేస్తుంటారు. అందులోనూ ఆలూ పరాటా కూడా ఫేమస్. కానీ చండీగఢ్ లోని ఓ చిన్నపాటి ధాబాలో డీజిల్ లో పరాటా చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.

ఏమిటీ డీజిల్ పరోటా..
  • ఆ వీడియోలో ధాబా వంటవాడు.. పిండిని వత్తి రొట్టెను చేశాడు. అందులో ఉడకబెట్టిన బంగాళదుంపల మిక్స్ ను వేశాడు. దాన్ని మెల్లగా వత్తి.. ఆలూ పరాటా తయారు చేశాడు. తర్వాత పెనంపై వేసి రెండు వైపులా కాస్త కాల్చాడు. ఇంతదాకా బాగానే ఉంది. 
  • చివరిగా ఆ పరోటాపై ‘డీజిల్’ పోశాడు. అదేమిటంటే డీజిల్ మిక్స్ అని చెప్తూ.. నిండుగా నింపాడు. అందులోనే ఆలూ పరాటాను బాగా కాల్చాడు.
  • నెబ్యులా వరల్డ్ అనే ‘ఎక్స్’ ఖాతాలో మే 12న ఆదివారం ఈ వీడియోను పోస్ట్ చేయగా.. వైరల్ అయింది. ఒక్క రోజులోనే ఏకంగా నాలుగున్నర లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ ‘డీజిల్ పరాటా’పై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.
  • ‘ఇలాంటి పరాటా తింటే కేన్సర్ రావడం ఖాయం. ఏమిటీ దారుణం’ అంటూ కొందరు కామెంట్ చేస్తే.. ‘ఇలాంటి వాటిని అధికారులు పట్టించుకోరా?’ అని మరికొందరు మండిపడుతున్నారు.
  • అది డీజిల్, పెట్రోల్ ఏదీ కాదని.. చాలాసార్లు మళ్లీ మళ్లీ వాడిన నూనె అయి ఉంటుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. అది డీజిల్ అయినా కాకున్నా.. డేంజర్ మాత్రం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement
Advertisement
Diesel parata
Viral Videos
offbeat

More Telugu News